Medak: రంగాయిపల్లిలో విద్యుదాఘాతంతో రైతు మృతి!

Medak: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో బోరు మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతంతో రాజబోయిన లక్ష్మణ్ (42) అనే రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

RAJU,TOOPRAN
Published on: 27 Oct 2026 12:33 PM IST
Medak
X

Medak: రంగాయిపల్లిలో విద్యుదాఘాతంతో రైతు మృతి!

Medak: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన రాజబోయిన లక్ష్మణ్ (42) తన వ్యవసాయ పొలంలో బెండకాయ పంటకు నీరు పెట్టేందుకు బోరు మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

మృతుని కుటుంబ వివరాలు: లక్ష్మణ్ కు భార్య యాదమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు లావణ్యకు వివాహం కాగా, చిన్న కూతురు పూజ, కొడుకు మహేష్ ఉన్నారు.

పోలానికి కరెంట్ పోయి రావడంతో స్టార్టర్ వేస్తుండగా షాక్ తగిలినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ అన్న కుమారుడు బోరు వద్దకు వెళ్లగా స్టార్టర్ వద్ద పడిపోయి ఉండటం గమనించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి చూసి కన్నీరుమున్నీరయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు మృతితో రంగాయిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN