Sangareddy: మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ యత్నం!

Sangareddy: సంగారెడ్డి-మెదక్ జిల్లాల సరిహద్దుల్లో మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కొని పారిపోతున్న ఇద్దరు దుండగులను రైతులు వెంబడించి పట్టుకున్నారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 29 Oct 2026 11:25 AM IST
Sangareddy
X

Sangareddy: మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ యత్నం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా హత్నూర,జిన్నారం మండలాల సరిహద్దులో ఓ మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు అపహరించి పారిపోతున్న ఇద్దరు దుండగులను రైతులు వెంబడించి పట్టుకున్నారు వివరాల్లోకి వెళ్తే సోలక్‌పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ వ్యవసాయ పనులు చేస్తుండగా, హత్నూర మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన వడ్డే సాయిలు, మీనంపల్లి అరవింద్ అనే ఇద్దరు దుండగులు మహిళ మెడలోని పుస్తెలతాడును అపహరించి పారిపోయేందుకు ప్రయత్నించారు.

మహిళ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని రైతులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే నిందితులను వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బాధితురాలు కర్రతో నిందితులను చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జిన్నారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల నుండి తెలియాల్సి ఉంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR