Medak: న్యాయం జరగకుంటే చావడమే గతి.. రైతు బిడ్డల కన్నీటి నిరసన!

Medak: మెదక్ జిల్లా శివంపేట తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు భద్రియా కుటుంబం నిరసన.

G Ashok Reddy, Narsapur
Published on: 2 May 2026 1:24 PM IST
Medak
X

Medak: న్యాయం జరగకుంటే చావడమే గతి.. రైతు బిడ్డల కన్నీటి నిరసన!

మెదక్ జిల్లా: శివంపేట తహశీల్దార్ కార్యాలయం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నేలపై పడుకుని ఓ రైతు కుటుంబం నిరసన చేపట్టారు.తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు కార్యాలయంలోనే పడుకుంటామని భీష్మంచి కూర్చున్నారు.2020 లో మృతిచెందిన శివంపేట (మం) భీక్య తండాకు చెందిన రైతు భద్రియా తన పేరుపై సర్వే నెంబర్ 315/37/2లో ఉన్న 2 ఎకరాల 38 గుంటల భూమిని అక్రమంగా BRS పార్టీ నాయకుడు హనుమంతరావు పట్టా చేయించుకున్నారని రైతుల ఆరోపించారు. అందుకు రెవెన్యూ అధికారులు కూడా వారికి మద్దతుగా నిలిచి తన భూమిని తన పేరు మీద లేకుండా చేశారని ఆరోపించారు ఆ భూమిని హైదరాబాద్ కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మేసి సొమ్ము చేసుకున్నారని భద్రియా కుమారుల ఆవేదన వ్యక్తం చేశారు.తమ నాన్న పేరుపై ఉన్న పట్టా భూమిని అప్పటి అధికారులు మాముళ్లకు అలవాటు పడి మరొకరి పేరు మీదికి మార్చారంటున్న భద్రియా కుమారులు మునిరామ్, చందర్, బాల్ సింగ్, లక్ష్మణ్, శివాలాల్ చాలా ఏళ్లుగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఈరోజు ఆందోళన చేపట్టారు. తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిని కఠినంగా శిక్షెన్సీ తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబం వేడుకుంటున్నారు తమకు న్యాయం చేయకపోతే తమ కుటుంబానికి వ్యవసాయ భూమిని తమకు ఇప్పించకపోతే తమకు ఆత్మహత్య గతే అని కన్నీరు మున్నూరు అవుతున్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story