Narsapur: కళ్లెదుటే తడిసిన ధాన్యం.. ఆగ్రహంతో రోడ్డెక్కిన రైతన్నలు!

Narsapur: నర్సాపూర్‌లో భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రోడ్డెక్కిన రైతులు. జాతీయ రహదారిపై నిరసన, కలెక్టర్ రావాలని డిమాండ్.

G Ashok Reddy, Narsapur
Published on: 27 May 2026 12:56 PM IST
Narsapur
X

Narsapur: కళ్లెదుటే తడిసిన ధాన్యం.. ఆగ్రహంతో రోడ్డెక్కిన రైతన్నలు!

మెదక్ జిల్లా: నర్సాపూర్ వ్యవసాయ డివిజన్ వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి వందలాది క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతన్నలు ఆందోళన బాట పట్టారు. డివిజన్ పరిధిలోని కౌడిపల్లి శివంపేట్ నర్సాపూర్ చిలిపిచ్చాడు కొల్చారం వెల్దుర్తి మండలాల్లో రాత్రి పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది దీంతో కళ్ళల్లో ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధాన్యాన్ని సేకరించకపోవడం మూలంగా వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిందని ఈ అంతటికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుధవారం నాడు ఉదయం కౌడిపల్లి మండలంలోని వెంకటరావుపేట చౌరస్తాలో శివంపేటలో రైతులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు జాతీయ రహదారిని దిబ్బందించి కలెక్టర్ రావాలంటే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని రైతుల డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఇక్కడికిక్కడ అధికారులు అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story