Narsapur: నర్సాపూర్‌లో మాతాజీ హార్డ్‌వేర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని మాతాజీ హార్డ్‌వేర్ గోదాంలో అగ్నిప్రమాదం. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో తప్పిన ప్రమాదం.

G Ashok Reddy, Narsapur
Published on: 18 Aug 2026 11:18 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో మాతాజీ హార్డ్‌వేర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం!

Narsapur: నర్సాపూర్ పట్టణంలో మాతాజీ హార్డ్‌వేర్ గోదాంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.

గోదాం నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. గోదాంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story