Medak: గోమారంలో ఉద్రిక్తత రోడ్డెక్కిన ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు
Medak: మెదక్ జిల్లా గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన. శక్తి స్కీమ్‌ను రద్దు చేసి SBTET పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్.
Medak: గోమారంలో ఉద్రిక్తత రోడ్డెక్కిన ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు
Medak: శివంపేట మండలం గోమారం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. కళాశాల విద్యార్థులు యూనిఫాంలతో కళాశాల ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “వుయ్ వాంట్ జస్టిస్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌ను వెంటనే తొలగించాలని, పాలిటెక్నిక్ కళాశాలలను పూర్తిగా SBTET ఆధ్వర్యంలోనే కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97 వల్ల పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆవేదన, పాలిటెక్నిక్ కళాశాలలను ఇతర విద్యాసంస్థల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందే పరిస్థితి ఉండదని విద్యార్థులు పేర్కొన్నారు. ఇప్పటికే పాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
గత కొన్ని రోజులుగా విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తూ, కళాశాలల వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో విద్యార్థులు మరోసారి నిరసనకు దిగారు.
డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం, శక్తి స్కీమ్‌ను తొలగించి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ విద్యా భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కావడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వరుసగా విద్యార్థులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.
గత వారం రోజులు గా విద్యార్థులు ఆందోళన లు కొనసాగిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




