Medak: హుస్నాబాద్‌కు గౌడన్నల చలో హక్కుల సాధన కోసం భారీ సభ

Medak: హుస్నాబాద్‌లో జరగనున్న గౌడ హక్కుల పోరాట సాధన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు. గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి డిమాండ్లు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 10 July 2026 7:57 PM IST
Medak
X

Medak: హుస్నాబాద్‌కు గౌడన్నల చలో హక్కుల సాధన కోసం భారీ సభ

మెదక్ జిల్లా: మెదక్ జిల్లా గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో జరగనున్న *"గౌడ హక్కుల పోరాట సాధన సభ"*ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుంచి గౌడ గీత కార్మికులు పెద్ద సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు. గౌడ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ సభ కీలకమని పేర్కొన్నారు.

గీత కార్మికులకు ప్రతినెల రూ.5,000 జీవన భృతి అందించాలని, ప్రతి గ్రామంలో గౌడ కులస్తులకు 5 ఎకరాల భూమి కేటాయించాలని, ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, చట్టసభల్లో 40 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

మెదక్ జిల్లా గౌడ హక్కుల సాధన సమితి (మోకు దెబ్బ) అధ్యక్షులు గంగరాం గౌడ్ మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుంచి గౌడ గీత కార్మికులు భారీ సంఖ్యలో హుస్నాబాద్ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు దాటిన ప్రతి గీత కార్మికుడికి పెన్షన్ అమలు చేయడంతో పాటు ఐడీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, మోహన్ గౌడ్, వెంకట్ గౌడ్, మానే గౌడ్, లింగం గౌడ్, గణేష్ గౌడ్, భూషణ్ గౌడ్, సత్య గౌడ్, భిక్షపతి గౌడ్, యాద గౌడ్, నర్సా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story