Narayankhed: అనారోగ్యంతో ప్రభుత్వ టీచర్ బలవన్మరణం!

Narayankhed: నారాయణఖేడ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య. ఆరోగ్య సమస్యలు మరియు ఫిట్స్ వ్యాధితో మనస్తాపం చెంది ఉరివేసుకుని మృతి చెందిన సిద్ధలింగప్ప.

ALEEM, NARAYANAKHAD
Updated on: 2 Aug 2026 9:39 AM IST
Narayankhed
X

Narayankhed: అనారోగ్యంతో ప్రభుత్వ టీచర్ బలవన్మరణం!

Narayankhed: కపిల శరణప్ప, తండ్రి: కంటెప్ప, వయస్సు: 65 సంవత్సరాలు, కులం: లింగాయత్, వృత్తి: వ్యవసాయం, నివాసము: చాప్ట k గ్రామం నారాయణఖేడ్ మండలం, గారి ఫిర్యాదు ప్రకారం తన కొడుకు అగు కపిల సిద్ధలింగప్ప S/O శర్నప్ప వయస్సు 38 సం కులం లింగాయత్ వృత్తి ప్రభుత్వ టీచర్ r/o చాప్ట k నారాయణఖేడ్ ప్రస్తుత నివాసం: సాయిబాబా కాలనీ, నారాయణఖేడ్ గారు గత 5 సంవత్సరాల క్రితం మంగళపేట్, నారాయణఖేడ్ కు చెందిన చెందిన భాగ్యలక్ష్మి తో ప్రేమ వివాహం జరిగింది.

వీరి సంసార జీవితం లో ఇద్దరు పిల్లలు కలరు తన భార్య వాళ్ళ అమ్మగారి ఇంటికి పిల్లలతో పాటుగా మంగళ్పేట్ కి మూడు రోజుల క్రితం వెళ్ళింది. మృతుడు ఒక్కడే ఉంటున్నాడు. సిద్ధలింగప్ప తాను ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఈరోజు తేదీ 01.08.2026 నాడు సమయం అందజ 6:00 pm గం లకు తన బావమర్ది అయిన జ్ఞానేశ్వర్ కు వీడియో కాల్ చేసి నేను చనిపోతున్నా అని చెప్పి కాల్ కట్ చేసినాడు.

ఇట్టి విషయం తెలిసి వెంటనే అట్టి ఇంటికీ వెళ్లగా లోపలి నుంచి తలుపులు పెట్టబడి ఉన్నాయి. దాంతో జ్ఞానేశ్వర్ తలుపులు కొడుతూ పిలిచినా పలకకపోవడం తో తలుపులు పగల గొట్టి ఇంట్లోకి వెళ్ళి చూడగా, నా ఉరి వేసుకొని ఉన్నాడు వెంటనే అతనిని ప్రభుత్వ ఆసుపత్రి నారాయణఖేడ్ కు తీసుకెళ్లగా, డ్యూటీ డాక్టర్ చూసి అప్పటికే చనిపోయినాడు అని తెలిపాడు. కొన్ని రోజుల నుండి తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక, ఇబ్బంది పడుతూ తనకు ఉన్న పిట్స్ సమస్య వల్ల కూడా భాద పడుతూ, తనంతట తానుగా చనిపోవాలని, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టుగా అనిపిస్తుంది అని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది.

ALEEM, NARAYANAKHAD

ALEEM, NARAYANAKHAD

Next Story