Narsapur: నర్సాపూర్ ‘రాయరవు చెరువు’కు మహర్దశ.. రూ. 2.50 కోట్లు మంజూరు!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ లోని రాయరవు చెరువు సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.50 కోట్లు మంజూరు చేసింది.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 5 Jun 2026 2:43 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ ‘రాయరవు చెరువు’కు మహర్దశ.. రూ. 2.50 కోట్లు మంజూరు!

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రాయరవు చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధుల సాధనలో నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు స్థానిక నాయకులు తెలిపారు.

నర్సాపూర్ పట్టణానికి సమీపంలో రెండు కొండల మధ్య, అటవీ వాతావరణంలో విస్తరించి ఉన్న రాయరవు చెరువు సహజసిద్ధమైన అందాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదనలు తీసుకెళ్లగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రూ.2.50 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ సదుపాయాల ఏర్పాటు, సందర్శకుల కోసం మౌలిక వసతుల కల్పన, పర్యాటకులను ఆకర్షించే అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తయితే రాయరవు చెరువు పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది.

ఈ అభివృద్ధి వల్ల నర్సాపూర్ పట్టణానికి కొత్త శోభ చేకూరడంతో పాటు పర్యాటక రంగం విస్తరించి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story