Sangareddy: నస్తీపూర్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే.. కలల సాకారానికి పిలుపు

Sangareddy: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే మరియు పేరెంట్స్ మీటింగ్.

G Ashok Reddy, Narsapur
Published on: 23 April 2026 9:16 PM IST
Sangareddy
X

Sangareddy: నస్తీపూర్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే.. కలల సాకారానికి పిలుపు

సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలంలోని నస్తీపూర్ గ్రామం లో ఉన్న ప్రాథమిక పాఠశాల లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు మరియు పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు M.లోకనాధం మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ గారు అన్నట్టు కలల కనాలి వాటిని పట్టుదలతో సాకారం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి వారి కలల డ్రీమ్ ఫోటోలను బహుమతులు అందజేశారు అలాగే ఆదర్శ అమ్మ పాఠశాల చైర్మన్ చైర్మన్ గొడుగు స్వప్న చేతుల మీదుగా ప్రొగ్రేస్ కార్డులను ఇవ్వడం జరిగింది. విద్యార్థులు అందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి గురువుతో పాటు తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకురావాలని అన్నారు. చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి ఉండి ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. తమ పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్, విద్యా వాలంటీర్ ప్రవళిక, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story