Sangareddy: సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!
Sangareddy: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ దంపతులు, ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
Sangareddy: సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!
Sangareddy: సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా పోలీసు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రకృతి అందాలు, ఆచార సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటలతో వేడుకలను జరుపుకున్నారు. సంప్రదాయ పాటలు, కోలాటాలు, ఆటపాటలతో పోలీసు కుటుంబ సభ్యుల సందడి మధ్య వేడుకలు అంబరాన్నంటాయి..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, పోలీసు కుటుంబాల మధ్య ఆత్మీయత, ఐక్యతను పెంపొందించేలా ఈ వేడుకలు నిర్వహించారు. కుటుంబసభ్యులందరూ ఒకచోట చేరి ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.




