Huzurnagar: పారిశుద్ధ్య కార్మికులతో గ్రీన్ వుడ్ పాఠశాల పిల్లల దినోత్సవం!
Huzurnagar: హుజూర్‌నగర్ గ్రీన్ వుడ్ పాఠశాల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పిల్లల దినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు.
Huzurnagar: పారిశుద్ధ్య కార్మికులతో గ్రీన్ వుడ్ పాఠశాల పిల్లల దినోత్సవం!
Huzurnagar: పిల్లల దినోత్సవ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు గ్రీన్ వుడ్ పాఠశాల యాజమాన్యం. కోడి కంటే ముందే లేచి ఊరు శుభ్రంగా ఉండేందుకు పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుట కోసం అహర్నిశలు శ్రమించే పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ వారికి పండ్లు బ్రెడ్ అందించి పిల్లల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ కమిషనర్ సతీష్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ పాఠశాల ప్రిసిపల్ మర్రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రేపటి తరానికి వారసులు దేశ భవిష్యత్తు కు వారదులు అయిన పిల్లలు ఇలా వినూత్నంగా ఆలోచించి పరిశుద్ధ కార్మికులతో కలసి పిల్లల దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు.
దేశ ప్రయోజనాలకోసం మంచి భవిష్యత్తు కోసం పిల్లలు ఉన్నతంగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.




