Sangareddy: ఆదర్శం చాటిన టీం GRK రాకేష్ గౌడ్.. 'శబాష్' అంటున్న సంగారెడ్డి వాసులు!

Sangareddy: సంగారెడ్డి బ్రాహ్మణవాడలో దుర్గమ్మ నిమజ్జన ఖర్చును తాగునీటి సౌకర్యాలకు మళ్లించిన టీం GRK రాకేష్ గౌడ్. ఆదర్శవంతమైన నిర్ణయంపై కాలనీవాసుల హర్షం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Oct 2026 8:50 AM IST
Sangareddy
X

Sangareddy: ఆదర్శం చాటిన టీం GRK రాకేష్ గౌడ్.. 'శబాష్' అంటున్న సంగారెడ్డి వాసులు!

Sangareddy: సంగారెడ్డి పట్టణం 3వార్డు బ్రాహ్మణవాడ లో జిల్లాల రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో గత 11సంవత్సరాలుగా శ్రీ దుర్గా భవాని అమ్మవారిని ప్రతిష్టిస్తున్న భవాని యూత్ అసోసియేషన్ టీం GRK సభ్యులు.

ఈ సందర్బంగా జిల్లాల రాకేష్ గౌడ్ మాట్లాడుతూ 11సంవత్సరాలుగా అమ్మవారి నిమజ్జన ఊరేగింపును భారీ అత్యంత ఖర్చుతో నిర్వహిస్తామని అన్నారు, కానీ ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో తమ బ్రాహ్మణవాడ లో ప్రజలకు తీవ్ర నీటి కొరత ఏర్పడినందున ఈ సారి నిమజ్జన ఖర్చును పూర్తిగా తగ్గించి భజన పాటలతో సాంప్రదాయంగా దుర్గమ్మ ను నిమజ్జనం చేస్తున్నామని తెలిపారు, నిమజ్జనానికి అయ్యే ఖర్చుతో మున్సిపల్ అధికారులు, చైర్మన్, కౌన్సిలర్ జగన్ తో కలిసి చర్చించి బ్రాహ్మణవాడలో అవసరం ఉన్న చోట బోర్లు వేయించి ఇంటింటికి పైప్ లైన్ లు కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తూ ప్రతీ ఒక్కరూ నీటిని ఆదా చేసి ఎల్ నినో ప్రభావాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కాలనీ వాసులు మాట్లాడుతూ రాకేష్ గౌడ్ నిర్ణయం అభినందనీయమని కొనియాడారు, ఆ అమ్మవారి కృపతో అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాల రాకేష్ గౌడ్ మరియు టీం GRK సభ్యులు భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు స్థానిక కాలనీ పెద్దలు మహిళలు యువకులు భక్తులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్