Medak: తప్పిన ప్రాణాపాయం.. కళ్లముందే కాలిబూడిదైన యంత్రం!
Medak: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఆరేపల్లిలో విద్యుత్ వైర్లు తగిలి హార్వెస్టర్ దగ్ధమైంది.
Medak: తప్పిన ప్రాణాపాయం.. కళ్లముందే కాలిబూడిదైన యంత్రం!
మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం ఆరేపల్లి గ్రామంలో గురువారం ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలి హార్వెస్టర్ యంత్రం పూర్తిగా దగ్ధమైంది. హవేళిగణపూర్ మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన రమేష్ నాయక్ ఈ హార్వెస్టర్ యజమాని. శ్రీకాంత్ రెడ్డి పొలంలో కోత పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.హార్వెస్టర్ డ్రైవర్ అప్రమత్తంగా కిందికి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.13 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని రమేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనపై పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




