Hathnoora: హత్నూరలో వైభవంగా మొహర్రం వేడుకలు.. పోటెత్తిన భక్తులు!
Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూరలో మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా భక్తులు పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
Hathnoora: హత్నూరలో వైభవంగా మొహర్రం వేడుకలు.. పోటెత్తిన భక్తులు!
హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర గ్రామంలో మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పీర్లకు కుడుకలు, దట్టీలు సమర్పించి ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నల్లోల్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ మానస చెక్క రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా సామరస్య వాతావరణంలో మొహర్రం పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు.
వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొనడంతో హత్నూర లో పండుగ శోభ సంతరించుకుంది.
Next Story




