Narsapur: హత్నూరలో అక్రమ ఇసుక టిప్పర్ పట్టివేత!
Narsapur: హత్నూరలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా: దౌల్తాబాద్ చౌరస్తా వద్ద టిప్పర్ సీజ్, డ్రైవర్ షేక్ చాంద్ పాషాపై కేసు నమోదు, వాహనం పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
Narsapur: హత్నూరలో అక్రమ ఇసుక టిప్పర్ పట్టివేత!
నర్సాపూర్: హత్నూర ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను హత్నూర పోలీసులు పట్టుకున్నారు. డే పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో డే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దౌల్తాబాద్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ టిప్పర్ TS 08 UJ 2466ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు.
టిప్పర్‌లో ఇసుక ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇసుకను తరలించేందుకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, ఇతర పత్రాలను పరిశీలించారు. అయితే ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
వాహన డ్రైవర్‌ను విచారించగా *షేక్ చాంద్ పాషా (39)*గా గుర్తించారు. ఇస్మాయిల్ ఖాన్పేట్ నక్కవాగు నుంచి యజమాని ఆదేశాల మేరకు ఇసుకను గుమ్మడిదలకు తరలిస్తున్నట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
అనంతరం టిప్పర్‌ను హత్నూర పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిబంధనల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలింపుపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.




