Medak: మెదక్ ఖిల్లా మాత్రమే కాదు.. జిల్లాలో మీరు చూడని అద్భుతాలు ఇవే!

Medak: మెదక్ జిల్లాలోని మరుగున పడిన అద్భుత చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోండి. మెతుకు సీమ వైభవాన్ని చాటిచెప్పే ప్రత్యేక కథనం.

NAGARAJ, MEDAK
Published on: 26 May 2026 4:11 PM IST
Medak
X

Medak: మెదక్ ఖిల్లా మాత్రమే కాదు.. జిల్లాలో మీరు చూడని అద్భుతాలు ఇవే!

మెదక్: మెతుకు సీమ ఒక చారిత్రకమైన నేపథ్యం గల ప్రాంతం ఎంతోమంది రాజులు రాణి లు ఏలిన ఈ ప్రాంతంలో నేటికీ చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. మెతుకు సీమకు జీవనది మంజీరా నది. పరిహారక ప్రాంతంలో నిత్యం కళకళలాడే పంట పొలాలతో విరజల్లుతుండే ఈ ప్రాంతం పర్యాటక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు. కవి రచయిత చరిత్రకారుడు.బుర్ర సంతోష్.మరుగున పడిన చారిత్రక కట్టడాలను ప్రజలకు తెలిసే విధంగా పర్యాటక రంగంలో ముందుకు ప్రయత్నం మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మెదక్ చర్చి. పోచారం అభయ అరణ్యం. పోచారం కాకుండా ఇంకా ఏమున్నాయో తెలుసుకుందాం

* వేల్పుగొండ తుబురేశ్వర స్వామి ఆలయం

కల్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించబడి కాకతీయుల కాలంలో పునర్నర్మించిన వెయ్యేళ్ల నాటి అద్భుతాల శిల్పకళా వైభవం ఈ ఆలయం.నల్లరాతి మీద చెక్కిన అద్భుత శిల్పాలు కర్ణాటక హంపి హళేబీడు వరంగల్ రామప్ప వేయి స్తంభాల గుడిని పోలీ ఉండడం విశేషం.

*మెదక్ RDO బిల్డింగ్

వందేళ్ల క్రితం అనగా 1926 లో నిజాం ప్రభుత్వం కట్టించిన కట్టడం.అద్భుతమైన ఆర్చీలు పెద్ద పెద్ద డిజైన్ కిటికీలు లోపల టేకు చెక్కతో చేసిన ఫర్నీచర్.బ్రిటీష్ శైలి లో కట్టించిన ప్రభుత్వ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం

*కొంటూరు మసీద్

కుతుబ్షాహి కాలంలో హజ్రత్ మౌలానా అలీ సాహెబ్ కట్టించిన పురాతన మసీద్.కొంటూరు చెరువు ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో కేవలం రాతి డంగు సున్నంతో నిర్మించిన ఈ మసీదు రెండు పెద్ద మినార్లు 4 చిన్న మినార్లతో చూడదానికి ఎంతో అందంగా ఉంటుంది.

*చందంపేట మెట్ల బావి

18 వ శతాబ్దంలో మెదక్ ప్రాంతాన్ని పరిపాలించిన రాణి శంకరమ్మ కుటుంబీకురాలు చందమ్మ పేరు మీద నిర్మించిన ఊరు.ఊర్లో అద్భుతమైన రాతి కోట మరియు అప్పటి పాలకుల కోసం కట్టించింకున్న మెట్ల బావి ప్రత్యేకమైనది.మెదక్ జిల్లాలోని అతి పెద్ద రాతి మెట్ల బావి చందంపేటలో ఉండడం విశేషం.

*తిపన్నగుల్ల శిథిలాయలం

మొదటి తరం కాకతీయలు శైలి శివాలయాలం.తిప్పడు అనే కాకతీయ సైనికాధికారి నిర్మించిన ఆలయం కానీ కొన్ని అనివార్య కారణాల వలన ప్రతిష్ఠాపన జరగలేదు.కానీ ఇక్కడున్న అద్భుతమైన శిల్ప కళ రామప్ప ను పోలి వుండడం విశేషం రాతి స్తంభాలు ద్వార బందాలు భారీ నందులు మన మెదక్ జిల్లా అద్భుతమైన వారసత్వ సంపదకు సాక్ష్యం

*శిఖార్ ఘర్

నిజాం రాజు పోచారం అడవిలో జంతువులను వేయడానికి వచ్చేవాడు అప్పుడు అతని కోసం కట్టిన రాజ భవనం.1918 లో కట్టిన రాతి కట్టడం నేటికి చెక్కుచెదరకుండా ఉండడం విశేషం

వెంకట్రావుపేట అప్పాజీపల్లి వెల్మకన్నె అల్లాదుర్గం శంకరంపేట పాపన్నపేట గ్రామాల్లోని కోటలు ఎన్నో గ్రామాల్లోని బురుజులు వందేళ్లు నిండిన ప్రాజెక్టులు ఘనపూర్ ఆనకట్ట పోచారం రిజర్వాయర్ బరాకమాన్ రాయిన్పల్లి ప్రాజెక్ట్ మాడూరు శిల్పాలు రుఖ్మ పూర్ శిథిలయం ఆది మానవుల రాతిచిత్రాలు ఏడుపాయల మంబోజిపల్లి బస్వాపూర్ హస్తాలపూర్ లాంటివి చూడవలసిన చారిత్రక ప్రాంతాలు

మన మెతుకుసీమ మెదక్ జిల్లాలో ఎన్నో ఘనమైన చారిత్రక వారసత్వ సంపద దాగి ఉంది.ఇలాంటి అద్భుతమైన చరిత్రను తర్వాతి తరాలకు అందించడం మన భాద్యత మరియు మెదక్ టూరిజం పరంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.హైదరాబాద్ కు అందుబాటులో ఉండడం ఏడుపాయల చర్చి ఖిల్లా పోచారం తో పాటు ఎన్నో చారిత్రక ప్రాంతాలు ఉండడం మెదక్ కు కలిసివచ్చే అంశాలు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story