Husnabad: 400 మీటర్ల పరుగులో హుస్నాబాద్ విద్యార్థి రిశ్వంత్ ప్రతిభ
Husnabad: ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగులో హుస్నాబాద్‌కి చెందిన రిశ్వంత్ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు.
Husnabad: 400 మీటర్ల పరుగులో హుస్నాబాద్ విద్యార్థి రిశ్వంత్ ప్రతిభ
హుస్నాబాద్: 70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీల్లో హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. 17 ఏళ్ల బాలుర విభాగంలో 400 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
సిద్దిపేట జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల ఉమ్మడి స్థాయిలో 14, 17 ఏళ్ల బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి. రిశ్వంత్ 400 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.
ఈ సందర్భంగా విజేత రిశ్వంత్‌ను సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి బంగారు పతకంతో సత్కరించి అభినందించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్, అధ్యాపకులు శ్రీనివాస్ రాజు, రజిని అభినందించారు. విద్యార్థి కృషిని హుస్నాబాద్ మండల ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నర్రా భాస్కర్ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. వెంకటస్వామి, సీనియర్ పీడీలు సుజాత, రామేశ్వర్ రెడ్డి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.




