Kowdipally: ఆగని అక్రమ రవాణా.. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా?
Kowdipally: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు.
Kowdipally: ఆగని అక్రమ రవాణా.. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా?
కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లోని రాజిపెట్ గ్రామం లో ఓ ఫంక్షన్ హాల్ ఎసి కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి రాజీపేట గ్రామo లోని పెద్ద చెరువు నుండి ఎలాంటి ప్రభుత్వాలు అనుమతులు పొందకుండా అక్రమంగా మట్టిని తరలించి డంపింగ్ చేసిన సంఘటన కౌడిపల్లి మండల పరిధిలోని రాజపేట గ్రామంలో వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందిన నాగభూషణం పటేల్అనే వ్వక్తి గ్రామంలో కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టి గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు నుండి దాదాపుగా 600 ట్రాక్టర్ల మొరమ్మటిని అక్రమంగా తరలించి డంపింగ్ చేశారు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి ప్రభుత్వా ఖజానాకి గండి కొట్టి పెద్ద మొత్తంలో మురమ్మటిని కుప్పలుగా పోసి డంపింగ్ ఏర్పాటు చేశారు. మండల కార్యానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపేట గ్రామంలో ఇంత జరుగుతున్న నిద్రావస్థ లో ఇరిగేషన్ శాఖ ఉండిపోయింది.
నిమ్మకు నీరెత్తినట్లు అధికారులుప్రభుత్వం గతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని గాని ఇసుకను గాని తరలిస్తే కేసులు నమోదు చేస్తామని జీవో జారీ చేయగా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సైతం అక్రమంగా అనుమతులు లేకుండా మట్టి, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ సదరు వ్యక్తి ఆదేశాలను బేకాతర్ చేస్తూ తన ఇష్టరాజ్యంగా చెరువులో నుండి మొరమ్ మట్టిని తరలించారు.
నాగభూషణం పటేల్ రాజుపేట గ్రామంలో ఎలాంటి శుభకార్యాలైన, భగవంతుని ఉత్సవాలకు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తాడు అనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ అతనికి సహకరిస్తున్నారని నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ తెలియజేశారు. చర్యలు తీసుకునేది ఎవరు? ఈ విషయమై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా తన దృష్టికి రాలేదని అక్రమ మట్టి వ్యవహారాన్ని దాటవేశారు. ఏది ఏమైనా వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిస్తే చెరువు నిండినట్లయితే మూగజీవాలకు ప్రాణాపాయం తప్పదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




