Narsapur: పేదల సొంతింటి కల సాకారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చెన్నాపూర్, నాగులపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
Narsapur: పేదల సొంతింటి కల సాకారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం
Narsapur: నేడు నర్సాపూర్ నియోజకవర్గంలో శివ్వంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామంలో మరియు నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెల్పిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ఇంటిలో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రతి అర్హులైన కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, జిల్లా కార్యదర్శి రవీందర్ యాదవ్, శివ్వంపేట్ మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సర్పంచులు రవీందర్, సుమతి శివకుమార్, దాడిగా నరేష్, మహేష్, మోహన్ దాస్ గౌడ్, నాయకులు మరియు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.




