Sangareddy: స్టాన్లీ జోన్స్ సేవలు చిరస్మరణీయం: జావీద్ అలీ!

Sangareddy: ప్రముఖ అంతర్జాతీయ అథ్లెటిక్స్ అధికారి, ఏఎఫ్‌ఐ కోశాధికారి స్టాన్లీ జోన్స్ ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ పొందారు. టీఎన్జీవో నేత జావీద్ అలీ ఆయనను ఘనంగా సన్మానించారు.

Srinivas K, Sangareddy
Published on: 1 Nov 2026 7:36 PM IST
Sangareddy
X

Sangareddy: స్టాన్లీ జోన్స్ సేవలు చిరస్మరణీయం: జావీద్ అలీ!

సంగారెడ్డి: నా ఆత్మీయ మిత్రులు, AFI - ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ కోశాధికారి, అంతర్జాతీయ అథ్లెటిక్స్ అధికారి, ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ Stanley Jones గారు ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ పొందారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్‌లో జరిగిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో TNGOs యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు అథ్లెటిక్స్ అసోసియేషన్ SRD జిల్లా కార్యదర్శి Md. జావీద్ అలీ గారు పాల్గొని ఘనంగా సన్మానించారు.

Stanley Jones గారు ఫిజికల్ డైరెక్టర్‌గా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడంలో, అలాగే AFI కోశాధికారిగా, అంతర్జాతీయ అధికారిగా భారత అథ్లెటిక్స్ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా జావీద్ అలీ గారు కొనియాడారు. వారి పదవీ విరమణ జీవితం ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతతతో నిండాలని ఆకాంక్షించారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy