Narsapur: నర్సాపూర్ గిరిదీపం స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ!

Narsapur: నర్సాపూర్ గిరిదీపం స్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఎస్సై కృష్ణయ్య విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు తొడిగి బాధ్యతలు అప్పగించారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 14 Aug 2026 4:21 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ గిరిదీపం స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ!

Narsapur: నర్సాపూర్ పట్టణం లోని గిరిదీపం పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెర్మనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి నర్సాపూర్ ఎస్సై 2 కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నాయకత్వం అంటే కేవలం పదవి కాదని, అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడమే నిజమైన నాయకత్వమని అన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని తెలిపారు.

అనంతరం నూతన విద్యార్థి నాయకులు తమ బాధ్యతలను స్వీకరించి ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల క్రమశిక్షణను పాటిస్తూ, తోటి విద్యార్థులకు సహాయం చేస్తూ, ఉపాధ్యాయుల సూచనలను పాటించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు నాయకత్వ బాధ్యతలు, సమయపాలన, క్రమశిక్షణ, సేవాభావంపై అవగాహన కల్పించారు.

అనంతరం నూతన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ కవిత రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎం.డి. మోసిన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story