Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూరలో ఐటీ సోదాలు.. స్టీల్ పరిశ్రమలో తనిఖీలు!
Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు. ఉదయం నుండి కొనసాగుతున్న రికార్డుల పరిశీలన.
Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూరలో ఐటీ సోదాలు.. స్టీల్ పరిశ్రమలో తనిఖీలు!
Hathnoora: హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని వీఎస్పీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 5 గంటల నుంచే అధికారులు పరిశ్రమలోకి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
పరిశ్రమకు సంబంధించిన పలు రికార్డులు, పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలు ఏ అంశానికి సంబంధించి నిర్వహిస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
ఉదయం నుంచి సోదాలు కొనసాగుతుండటంతో పరిశ్రమ పరిసరాల్లో ఆసక్తి నెలకొంది. సోదాలు పూర్తయిన అనంతరం అధికారులు వెల్లడించే వివరాలతో పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




