Sangareddy: కుమారుడి పెండ్లి పత్రికను 16 ఆలయాల్లో ఉంచి పూజలు చేసిన జగ్గారెడ్డి దంపతులు!

Sangareddy: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీజీ జగ్గారెడ్డి దంపతులు తమ కుమారుడు తూర్పు భరత్ సాయి రెడ్డి వివాహ పత్రికను 16 ప్రముఖ ఆలయాల్లో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Srinivas K, Sangareddy
Published on: 11 Nov 2026 7:23 AM IST
Sangareddy
X

Sangareddy: కుమారుడి పెండ్లి పత్రికను 16 ఆలయాల్లో ఉంచి పూజలు చేసిన జగ్గారెడ్డి దంపతులు!

Sangareddy: తమ కుమారుడు తూర్పు భరత్ సాయి రెడ్డి వివాహం ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో జగ్గారెడ్డి, నిర్మల దంపతులు తమ కుమారుడిని వెంట బెట్టుకొని ఆలయాలకు వెళ్లారు. పెళ్లి పత్రిక దేవుళ్ళు, అమ్మవార్ల సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు.

తొలి పత్రికను రుద్రారంలోని గణేష్ గడ్డ ఆలయంలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సంగారెడ్డిలోని అస్తబల్ రేణుక ఎల్లమ్మ ఆలయం, నల్ల పోచమ్మ ఆలయం, సంగమేశ్వర ఆలయం, భవానీ మందిరం, మాణిక్ ప్రభు మందిర్, లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, దుర్గమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, వడ్డె వీర హనుమాన్ మందిర్, శ్రీ వైకుంఠ పురం ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, నవరత్నాలయం, ఎర్ర పోచమ్మ గుడి, రామ్ నగర్, రామ్ మందిర్… ఇలా మొత్తం 16ఆలయాల్లో పత్రికలు పెట్టి.. పూజలు నిర్వహించారు.

తాతా - నానమ్మ ఫోటో వద్ద పత్రిక పెట్టి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆలయాల్లో పత్రికలు పెట్టి పూజలు చేసిన అనంతరం జగ్గారెడ్డి దంపతులు రామ్ నగర్ లోని తమ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు భరత్ సాయిరెడ్డి తమ తాత- నానమ్మ చిత్రపటానికి నమస్కరించి, పెళ్లి పత్రికను ఫోటో వద్ద పెట్టారు. ఆ తర్వాత ఇంట్లోని పూజా మందిరంలో దేవతా విగ్రహాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి తూర్పు భరత్ సాయి రెడ్డి వాళ్ల ఆశీస్సులు అందుకున్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy