Narsapur: ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ఎం. హేమలత ఆకస్మిక తనిఖీ!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని గౌరవ న్యాయమూర్తి ఎం. హేమలత ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 23 May 2026 5:27 PM IST
Narsapur
X

Narsapur: ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ఎం. హేమలత ఆకస్మిక తనిఖీ!

మెదక్: నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని న్యాయమూర్తిఎం.హేమలత,ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మందుల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

రోగుల పట్ల నిర్లక్ష్యం వహించడం, విధుల్లో అలసత్వం ప్రదర్శించడం సహించబోమని హెచ్చరించారు. ప్రతి రోగికి సమానంగా వైద్య సేవలు అందేలా అప్రమత్తంగా పనిచేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story