Kondapaka: ఓటర్ల ‘సర్’ (SIR) ప్రక్రియను పరిశీలించిన కోమటిరెడ్డి నరేందర్!

Kondapaka: హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలన. కొండపాక గ్రామంలో బిఎల్ఏ, బిఎల్ఓలతో కలిసి ఓటర్ల ఆధారాలు పరిశీలన.

GANESH, JAMMIKUNTA
Published on: 4 Sept 2026 12:30 PM IST
Kondapaka
X

Kondapaka: ఓటర్ల ‘సర్’ (SIR) ప్రక్రియను పరిశీలించిన కోమటిరెడ్డి నరేందర్!

Kondapaka: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో 197,198 బూతులలో నోటీసులు వచ్చిన వారి ఇండ్లకు బిఎల్ఏ ,బిఎల్ వో లతో కలిసి వెళ్లి వారితో మాట్లాడి సంబంధిత ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కువ శాతం నోటీసులు వచ్చినవారిలో 2002 లో ఓటు వేసిన దానికి వాళ్ళ వారసుల వయస్సు తేడా వచ్చినవారున్నారని తండ్రి పేరు ఇంటి పేరులో తేడా ఉన్నవాళ్ళు 2002 ఓటర్ లిస్టు మ్యాపింగ్ కు సంబంధించి సరియయిన సమాచారం ఇవ్వని వాళ్ళు ఉన్నారని అన్నింటికీ దగ్గరుండి ఆధారాలు సేకరించి తుది జాబితాలో వీరందరి ఓట్లు నమోదు అయ్యే విధంగా పని చేయాలని బిఎల్ఏ లకు నరేందర్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఈఆర్వో కోఆర్డినేటర్ మొలుగూరి సదయ్య, సయాబ్ హుస్సేన్,మహమ్మద్ సజ్జు,బిఎల్ఎ లు రామకృష్ణ, శ్రీనివాస్, కొండపాక కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story