Konayapalli: కొనాయపల్లి దళితులపై దాడి: తూప్రాన్ డీఎస్పీ ఆఫీస్ ముట్టడి
Konayapalli: కొనాయపల్లి దళితులపై దాడి చేసిన సర్పంచ్ మన్నే కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలని కొనాయపల్లి నుంచి తూప్రాన్ డీఎస్పీ ఆఫీస్ వరకు 13 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు.
Konayapalli: కొనాయపల్లి దళితులపై దాడి: తూప్రాన్ డీఎస్పీ ఆఫీస్ ముట్టడి
కొనాయపల్లి: కొనాయపల్లి దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ వారీ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కొనాయపల్లి నుండి తుప్రాన్ DSP కార్యాలయం వరకు 13 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి DSP కార్యాలయం ముట్టడించడం జరిగింది.
ధర్నాను ఉద్దేశించి KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య, DBF జాతీయ కార్యదర్శి పి శంకర్, VCK పార్టీ నాయకులు తెలంగాణ శ్యామ్ మాట్లాడుతూ కొనాయపల్లి దళితులపై దాడి చేసిన సర్పంచ్ మన్నే కళ్యాణ్‌ను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గి కేసును నిరుగర్చడానికి చేస్తున్న ప్రయత్నలను విరామించుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను బెదిరించే విదంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విట్టల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు జరిగిన గ్రామాల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యటించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, కుల వివక్ష ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
కోనాయపల్లి, కిష్టాపూర్, కుచారం, నవాబుపేట, ఎదులపల్లి గ్రామాల్లో జరిగిన ఘటనలపై జిల్లా అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.ఎదులపల్లి గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనకుండా అగ్రకుల మహిళలు అడ్డుకున్నారని ఆరోపించారు. కోనాయపల్లి గ్రామంలో దళిత మహిళలపై సర్పంచ్ అనుచరులను దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు.
దళిత మహిళలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం దాడులు జరిగిన గ్రామాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించాల్సి ఉన్నప్పటికీ ఆ విధానం అమలు కావడం లేదన్నారు.
అక్టోబర్ 18న జరిగిన దాడుల కేసుల్లో ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని విమర్శించారు. కోనాయపల్లి, నవాబుపేట గ్రామాల్లో దాడులకు గురైన దళితులపైనే కౌంటర్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోనాయపల్లి అట్రాసిటీ కేసు విచారణ అధికారిగా ఉన్న తూప్రాన్ డీఎస్పీని మార్చాలని, దళితులకు న్యాయం జరిగేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మనోహరాబాద్, శివ్వంపేట ఎస్సైలను సస్పెండ్ చేయాలని కోరారు. జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులు, అట్రాసిటీ కేసులపై కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కోనాయపల్లి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని దళితులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు.
మండుటెండలో 13 కిలోమీటర్లు మీటర్లు పాదయాత్ర
దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండుటెండలో 13 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. చంటి పిల్లతో సైతం పాదయాత్రలో పాల్గొన్నారు.
నవంబర్ 11, 12 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న 48 గంటల నిరాహార దీక్షకు మద్దతు ఇస్తామని తెలిపారు. దళితులు పెద్దఎత్తున పోరుబాట పట్టకముందే కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
కేసు విచారణ వేగవంతం చేస్తా. DSP హామీ
కొనాయపల్లి దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని DSP జె నరేందర్ గౌడ్ హామీ ఇచ్చారు. కేసు విచారణ కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు దళితులపై దాడి చేసిన 12 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు. దళితులపై దాడి చేసిన 12 మందిని బైండొవర్ చేషమని తెలిపారు. కొనాయపల్లి దళితులపై దాడి చేసిన వారిపై నమోదు అయినా కేసులను ఆల్టరేషన్ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి. నాగరాజు, BSP నాయకులు కొమ్ము చంద్రం, DBF తుప్రాన్ డివిజన్ పంచమి చంద్రం, MCF నాయకులు




