Gajwel: మళ్లీ గజ్వేల్‌కు వస్తా రోజంతా మీతోనే ఉంటా కేటీఆర్!

Gajwel: గజ్వేల్ రిమ్మనగూడ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలను కలిసిన కేటీఆర్. త్వరలోనే మళ్లీ గజ్వేల్‌కు వచ్చి ఒక రోజంతా పార్టీ శ్రేణులతో గడుపుతానని భరోసా.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 14 Oct 2026 6:25 PM IST
Gajwel
X

Gajwel: మళ్లీ గజ్వేల్‌కు వస్తా రోజంతా మీతోనే ఉంటా కేటీఆర్!

గజ్వేల్: మళ్లీ ఒకసారి గజ్వేల్‌కు వస్తా ఒకరోజంతా మీతోనే ఉంటా” అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మనగూడ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్న ఆయన వారితో ఆప్యాయంగా మాట్లాడారు.

గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభకు వెళ్తున్న కేటీఆర్.. రిమ్మనగూడ ఎస్-4 వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.

అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులకు కేటీఆర్ అభివాదం చేశారు. నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గజ్వేల్‌కు మరోసారి వస్తానని, ఒకరోజంతా పార్టీ శ్రేణులతోనే గడుపుతానని హామీ ఇచ్చారు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. తమ నాయకుడు మరోసారి గజ్వేల్‌కు వచ్చి పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

అనంతరం కేటీఆర్ భారీ కాన్వాయ్‌తో గోదావరిఖనిలో జరగనున్న సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL