Hyderabad: మా ప్లాట్లు మాకే కావాలి.. కబ్జాదారులపై లక్ష్మీపురం ఓనర్ల యుద్ధం!

Hyderabad: కొల్లూరులో తమ భూములను కబ్జా చేస్తున్నారని లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆరోపణ.

RAJESH,	WEST ZONE
Updated on: 6 Jun 2026 10:34 AM IST
Hyderabad
X

Hyderabad: మా ప్లాట్లు మాకే కావాలి.. కబ్జాదారులపై లక్ష్మీపురం ఓనర్ల యుద్ధం!

Hyderabad: తప్పుడు పత్రాలతో కొందరు వ్యక్తులు తమ ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా, తమపైనే దౌర్జన్యం చేస్తున్నారని లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ సభ్యులు ఆరోపించారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.ఎన్. మూర్తి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం మండలం, కొల్లూరు గ్రామంలోని 142 ఎకరాల స్థలంలో 1,500 ప్లాట్లు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయు లతోపాటు ఈసీఐఎల్, హెచ్ఎల్, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అందరం కలిసి 1984లో ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. తప్పుడు డాక్యుమెంట్లతో తమ ప్లాట్లను మరోసారి అమ్మేశారని ఆరోపించారు.

అంతేగాకుండా సర్వేనంబర్188లోని 3.25 కుంటల భూమిలో వీఎల్ ఎస్ ప్రసాద్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొంది భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. అనుమతులను తక్షణం రద్దు చేయకుంటే తామంతా హెచ్ఎం డీఏ కార్యాలయం ఎదుట ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story