Toopran: తూప్రాన్‌లో భారీ చోరీ: బంగారం, వెండి, నగదు అపహరణ

Toopran: తూప్రాన్ ప్రగతినగర్ కాలనీలో బట్టల వ్యాపారి ఇంట్లో తాళం పగలగొట్టి 5 తులాల బంగారం, 20 తులాల వెండి, లక్ష నగదును దుండగులు అపహరించారు.

RAJU,TOOPRAN
Published on: 7 Nov 2026 2:36 PM IST
Toopran
X

Toopran: తూప్రాన్‌లో భారీ చోరీ: బంగారం, వెండి, నగదు అపహరణ

తూప్రాన్: తూప్రాన్ పట్టణంలోని ప్రగతినగర్ కాలనీలో చాళ్ల రఘు ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. కామారెడ్డికి చెందిన రఘు కొంతకాలంగా ఇక్కడ బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వేడుకలకు వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది.

ఇంట్లోని ఐదు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, లక్ష నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.క్లూస్ టీం తో పరిశీలిస్తున్నారు చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN