Hatnoora: పుట్టింటికి వెళ్ళిందని గుడిసెకు నిప్పు

Hatnoora: దౌలాపూర్‌లో దారుణం జరిగింది. తనతో కలిసి ఉండడం లేదనే కోపంతో భార్య, ఇద్దరు పిల్లలు, అత్తమామలను సజీవ దహనం చేసేందుకు ఓ వ్యక్తి గుడిసెకు నిప్పంటించాడు.

G Ashok Reddy, Narsapur
Published on: 22 May 2026 2:27 PM IST
Hatnoora
X

Hatnoora: పుట్టింటికి వెళ్ళిందని గుడిసెకు నిప్పు

హత్నూర: భార్య తనతో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదని ఇద్దరు పిల్లలు భార్య అత్తమామలను సజీవ దహనం చేయడానికి చూసిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ లో చోటుచేసుకుంది సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన అత్తమామలతో కలిసి భార్యాపిల్లల ను హత్య చేయడానికి గుడిసెకు నిప్పంటించిన మన్నె నాగరాజు.

వివరాల్లోకి వెళితే కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు హత్నూర మండలం దౌలాపూర్ కు చెందిన లావణ్య తో 2018లో వివాహం కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు నేత్ర,అవంతికలు ఉన్నారు కాగా మద్యానికి బానిసైన నాగరాజు కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యతో పాటు అత్తమామలైన మోహన్, నర్సమ్మలను వేధింపులకు గురి చేస్తున్నాడు.

విసిగిపోయిన భార్య లావణ్య పిల్లలతో కలిసి తన పుట్టిల్లు దౌలాపూర్ లో ఉంటుంది ఈ విషయమై నాగరాజు పలుమార్లు చంపేస్తాను, ఇల్లు తగలబెడతాను అంటూ తరచు బెదిరించే వాడని ఇదే క్రమంలో ఈ నెల 13 న రాత్రి దౌలాపూర్ వచ్చిన నాగరాజు భార్య ఇద్దరు కుమార్తెలు అత్తమామ ఇంట్లో ఉండగా గమనించి బయట నుండి గడియ పెట్టి పక్కన ఉన్న మరో గుడిసెకు నిప్పు పెట్టి ఈ ఇల్లు కూడా కాలిపోతుంది అని భావించాడు.

పక్క వీధిలో వివాహ కార్యక్రమం జరుగుతుండగా గుడిసె నుండి పొగ రావడం గమనించి అక్కడికి హుటాహుటిన చేరుకోగా గుడిసెలో ఎవరూ లేకపోగా పక్క ఇంటికి గడియ పెట్టి ఉండగా గమనించి గడియ తీయడంతో వారు పడుకొని ఉన్నారు వారిని సురక్షితంగా బయటకు బయటకు తీసుకువచ్చేసరికి మామ కాలికి గాయమైంది పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టగా నేరం తానే చేసినట్టు ఒప్పుకున్నాడు నాగరాజు.

వరకట్న వేధింపులకు పాల్పడి అత్త మామ భార్య పిల్లలను సజీవ దహనానికి యత్నించిన నాగరాజును రిమాండ్ కు తరలించారు పోలీసులు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story