Sangareddy: స్థల వివాదంలో తమ్ముడిని కర్రతో కొట్టి చంపిన అన్న!

Sangareddy: మక్తలూరు గ్రామంలో ఆస్తి తగాదాలతో తమ్ముడు కొత్తగాడి శ్రీనివాస్‌పై అన్న కొత్తగాడి వెంకటేష్ కర్రతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 12:22 PM IST
Sangareddy
X

Sangareddy: స్థల వివాదంలో తమ్ముడిని కర్రతో కొట్టి చంపిన అన్న!

Sangareddy: కంది మండలం, మక్తలూరు గ్రామంలో ఒక వ్యక్తిపై దాడి. కొత్తగాడి శ్రీనివాస్, తండ్రి సంగయ్య, వయస్సు: 36 సంవత్సరాలు, ఎస్సీ–మాదిగ, వృత్తి: కూలీ పని, మక్తలూరు గ్రామం, కంది మండలం. ఇతను నిందితుడు కొత్తగాడి వెంకటేష్‌కు తమ్ముడు.

నిందితుడు కొత్తగాడి వెంకటేష్ తన తమ్ముడైన కొత్తగాడి శ్రీనివాస్‌పై కర్రతో దాడి చేసి, శరీరంలోని వివిధ భాగాలపై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.

సుమారు 40 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఖాళీ ఇంటి స్థలం విషయంలో నిందితుడు మరియు మృతుని మధ్య గత రెండు సంవత్సరాలుగా దీర్ఘకాలిక వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థల వివాదమే దాడికి ప్రధాన కారణమై ఉండవచ్చని తెలుస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్