Narsapur: నర్సాపూర్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సైకిలిస్టుకు తీవ్ర గాయాలు!

Narsapur: మెదక్ జిల్లా శివంపేట-చిన్న గొట్టుముక్కల మధ్య రోడ్డు ప్రమాదం. సైకిల్‌పై వెళ్తున్న మిషన్ భగీరథ ఆపరేటర్ గొల్ల లచ్చల్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 22 Oct 2026 6:37 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సైకిలిస్టుకు తీవ్ర గాయాలు!

Narsapur: మెదక్ జిల్లా శివంపేట నుంచి చిన్న గొట్టుముక్కల గ్రామానికి సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన గొల్ల లచ్చల్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన గొల్ల లచ్చల్.. మిషన్ భగీరథకు సంబంధించిన పంప్‌హౌస్‌లో రాఘవ కాంట్రాక్ట్ కింద ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. శివంపేటలో విధులు నిర్వహిస్తున్న ఆయన, సైకిల్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR