Jogipet: మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మఠం బిక్షపతి!

Jogipet: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మాజీ చైర్మన్ మఠం బిక్షపతి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

UMASHANKAR, ANDOLE
Published on: 14 Sept 2026 3:33 PM IST
Jogipet
X

Jogipet: మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మఠం బిక్షపతి!

Jogipet: వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జోగిపేట హనుమాన్ చౌరస్తా వద్ద పట్టణ ప్రజలకు మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని గత 11 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆందోల్ నియోజకవర్గం ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అందజేశారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. మట్టి వినాయకుని పూజించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంలో భాగంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

వివిధ రకాల కెమికల్ ముడి పదార్థాలతో తయారుచేసే వినాయకుల ద్వారా నీటి,వాతావరణ కలుషితం జరుగుతుందని అన్నారు. సర్వవిజ్ఞాలను తొలగించే ఆ దేవదేవుడు ఆశీస్సులు పొందాలంటే మట్టి వినాయకులనే పూజించాలని కోరారు.

ఈ సందర్భంగా తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రహణంలో పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ గ్రహణం వీడి మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ వినాయకుని కోరుకుంటున్నానని అన్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE