Narsapur: గాంధీ జయంతి రోజున నర్సాపూర్‌లో మాంసం విక్రయాలపై నిషేధం!

Narsapur: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో మాంసం విక్రయాలపై పూర్తి నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ వెల్లడి.

G Ashok Reddy, Narsapur
Published on: 1 Oct 2026 7:40 PM IST
Narsapur
X

Narsapur: గాంధీ జయంతి రోజున నర్సాపూర్‌లో మాంసం విక్రయాలపై నిషేధం!

Narsapur: గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. అక్టోబర్ 2న పట్టణ పరిధిలో చేపలు, చికెన్, మటన్‌తో పాటు ఇతర రకాల మాంసాన్ని విక్రయించరాదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

ఈ మేరకు పట్టణంలోని మాంసం విక్రయదారులందరికీ ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అమలులో ఉండే నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు అక్టోబర్ 2న నిషేధాన్ని ఉల్లంఘించి మాంసం విక్రయాలు జరిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ హెచ్చరించారు. మాంసం విక్రయదారులు నిబంధనలను పాటించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur