Medak: మెదక్ పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మంచు విష్ణు

Medak: మెదక్ జిల్లాలో ఏడుపాయలు, మెదక్ చర్చి, ఖిల్లాను సందర్శించిన మంచు విష్ణు. వారసత్వ సంపదను కాపాడుకుంటూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని పిలుపు.

NAGARAJ, MEDAK
Published on: 18 July 2026 3:18 PM IST
Medak
X

Medak: మెదక్ పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మంచు విష్ణు

మెదక్: మనకున్న చరిత్ర 95% ప్రపంచంలో వేరే దేశాలకు ఎవరికి లేదు ని ఆ చరిత్రను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని-మా అధ్యక్షుడు ,విలక్షణ హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత మంచు విష్ణు అన్నారు.

శనివారం ,మెదక్ జిల్లా లో టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు ఏడుపాయలకు చేరుకోగానే అదనపు కలెక్టర్ నగేష్ మొక్క ను అందించి స్వాగతం పలికారు.ఏడుపాయల ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ తరుపున మంచి విష్ణుకు ఘనంగా సన్మానించారు తీర్థ ప్రసాదాలు అందించారు.

ఆలయ చరిత్ర , ప్రాముఖ్యాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంచు విష్ణు కు వివరించారు.అనంతరం చారిత్రక నేపథ్యం కలిగిన మెదక్ ఖిల్లాను సందర్శించి దాని చరిత్రను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అక్కడినుండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పురాతన ,వారసత్వ సంపదకు నిలయం మెదక్ జిల్లా అన్నారు. మన చరిత్ర గురించి పుస్తకాల్లో చదివాం,ఎన్నో విన్నాం కానీ చూసింది చాలా తక్కువ అని సినీ నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు, చారిత్రిక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.. వాటిని కాపాడుకోవాలి.. హైదరాబాద్ నుంచి మెదక్ కు కూతవేటు దూరంలో ఉన్న చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని చూడకపోవడం సిగ్గుచేటు అనిపించింది అన్నారు.

మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్నారు.. భవిష్యత్తులో నేను నటించే సినిమాలో కానీ ప్రొడ్యూస్ చేసే సినిమాలో అయినా మెదక్ నుంచి ఒక సినిమాకు అవకాశం ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారులు జిల్లా శాఖ అధికారులు మెదక్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story