Medak: త్వరితగతిన అన్లోడింగ్ చేయాలి.. జిల్లా అదనపు కలెక్టర్
Medak: మెదక్ జిల్లా ఘన్‌పూర్ మండలంలో రైస్ మిల్లులను జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Medak: త్వరితగతిన అన్లోడింగ్ చేయాలి.. జిల్లా అదనపు కలెక్టర్
Medak: ధాన్యాన్ని త్వరితగతిన అన్లోడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మిల్లర్లను ఆదేశించారు. ఘన్పూర్ మండలంలోని పలు రైస్ మిల్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు అన్లోడింగ్ ప్రక్రియ స్పీడ్ అప్ చేయాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని, అధికారుల ఆదేశించారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా తక్షణమే ధాన్యం దిగుమతి చేపట్టి, తూకం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
అకాల వర్షాల సంభవిస్తే రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన టార్పాలిన్లు, నిల్వ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అన్‌లోడింగ్‌లో ఆలస్యం జరిగితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో తదితరులు పాల్గొన్నారు.




