Medak: మెదక్‌లో జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Medak: మెదక్ జిల్లాలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అదనపు కలెక్టర్ నగేష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Medak: మెదక్‌లో జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Medak: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా లో ఘనంగా నిర్వహించలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు తెలిపారు.సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. మెదక్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.
పతాకావిష్కరణ, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల సందేశాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమర వీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించేల కార్యక్రమాలను రూపొందించాలన్నారు. స్టేజీ, మైక్, సౌండ్, త్రాగునీరు, విద్యుత్, పార్కింగ్ లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులను కోరారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ..ట్రాఫిక్, రవాణా ,పార్కింగ్ బందోబస్తు కు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సి ఈ వో ఎల్లయ్యా ,డి ఆర్ ఓ అంబాదాస్ రాజేశ్వర్ డిఆర్డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




