Medak: మెదక్ అయ్యప్ప స్వామి ఆలయ రజతోత్సవ వైభవం
Medak: మెదక్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది.
Medak: మెదక్ అయ్యప్ప స్వామి ఆలయ రజతోత్సవ వైభవం
Medak: భక్తుల కల్పతరువుగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడుగా మెదక్ అయ్యప్ప స్వామి ఆలయం విరాజిల్లుతోంది. భక్తి శ్రద్ధలకు ప్రతి రూపకంగా ఉన్న ఆలయం రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. మెదక్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న ఆలయం. 2001 మే 27న అనంతసాగర్ సరస్వతీ క్షేత్ర నిర్మాత, సరస్వతీ తత్వ ప్రచారాకులు ప్రత్యక్ష పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా జరిగింది.
ఆలయం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వార్షికోత్సవం, కుంభాబిషేకం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 14 నుంచి 20 వరకు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సదానంద మఠాధిపతి బసవకళ్యాణ్, మదనానంద పీఠాధీశ్వరులు (రంగంపేట) శ్రీశ్రీశ్రీ మాధవా నంద సరస్వతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ, అష్టకాల విద్యా మనోహర్ శర్మ నిర్వహణలో
మహారుద్ర పారాయణం, యజుర్వేద పారాయణం, దేవతా కళ్యాణం, పుష్పార్చన, హవనం, మహా కుంభాభిషేకం, రథోత్సవం, మహాపడి పూజ, దీపోత్సవం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఆలయ ప్రత్యేకతలు..
మెదక్ అయ్యప్ప దేవాలయంలో పంచ లోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏకశిలా పదునెట్టంబడి (18 మెట్లు) కలదు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా గణపతి ఆలయంలో గణపతి పంచాయతనం (శివుడు,సూర్యుడు, అంబిక, విష్ణు) విగ్రహాలను ప్రతిష్టించారు.
కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించే భక్తులు... ప్రమాణం చేసే మాల వేసుకోవాలి. మండలకాలం పాటు దీక్షను కొనసాగించాలి.
ఆలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి కుంభాభిషేకం, 18వ వార్షికోత్సవం పురస్కరించుకొని రెండవ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. రజతోత్సవ వార్షికోత్సవం సందర్భంగా మూడవ సారి కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మెదక్ పరిసర ప్రాంతాల్లో భక్తుల చేత కుంభాభిషేకం కేవలం మెదక్ అయ్యప్ప ఆలయంలో మాత్రమే నిర్వహిస్తున్నారు.
ఆలయంలో జరిగే నిత్యపూజలు..
ప్రతి నెల ఆలయంలో సుబ్రహ్మణ్య ఉత్సవ మూర్తికి అభిషేకం, ఉత్తరా నక్షత్రం రోజు అయ్యప్ప ఉత్సవ మూర్తికి అభిషేకం, మలయాళ పాల్గున మాసంలో స్వామివారి జన్మదినం, మలయాళ చైత్ర మాసంలో విషు పూజ నిర్వహిస్తున్నారు.
14 నుంచి 20 వరకు కార్యక్రమాలు ఇలా..
14-06-2026 ఆదివారం
ఉ:05:00 సుప్రభాతము, మహాభిషేకము, అలంకరణ
ఉ॥:07:00 కోటి రుద్ర పారాయణములో భాగముగా మహారుద్ర శ్రీసూక్త పారాయణములు,
లక్ష పుష్పార్చన శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి సదానంద మఠాధిపతి బసవకళ్యాణ్, మదనానంద పీఠాధీశ్వరులు రంగంపేట వారి అనుగ్రహభాషణము, భోజన ప్రసాదములు.
సా॥ 04:30 గణపతి స్తోత్రములు
మొదలగు స్తోత్ర పారాయణములు జరుగును.
రా॥ 07:30 చిన్నారులచే నృత్య ప్రదర్శన.
15-06-2026, సోమవారం
ఉ:05:00 సుప్రభాతము, నిత్య పూజాదికాలు, అలంకరణ, మంటపాసాదన
ఉ 9:35 శ్రీ మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, గురుపూజ, పంచగవ్య ప్రాశనము, అఖండ దీపస్థాపన, ఆచార్యాది ఋత్విగ్వరణము, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతో భద్ర మండల, ప్రధాన కలశ స్థాపన, అగ్నిప్రతిష్ఠ, ఔపాసనము, హవనము మరియు యజుర్వేద పారాయణము
సా. 04:30 ఆవాహిత దేవతా హవనములు. శివానందలహరి పారాయణము
సా.5:30 మహా లింగార్చన, ప్రదోషపూజ, అవధారయలు, తీర్ధప్రసాద వినియోగము.
రా 7:30 శ్రీమతి కొరిడే హరిణ పవన్ గారిచే సీతారాముల కళ్యాణము (కథ)
16-06-2026, మంగళవారము
ఉ.5:00: సుప్రభాతము, అభిషేకము, అలంకారము, ఆవాహితా దేవతా పూజ
8:30 సహస్ర మోదక హవనము, యజుర్వేద పారాయణము
ఉ 11:30 శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము
సా.04:30, రుద్ర హవనము, సౌందర్యలహరి పారాయణము
సాయంత్రం 05:30 ఆవాహిత దేవతా పూజ, అవధారయాలు, హారతి, తీర్ధప్రసాద వినియోగము,
రాత్రి శ్రీ నారసింహ గురుస్థానము భువనేశ్వరి చక్ర భజన, చుంచనకోట.
17-06-2026, బుధవారము
ఉ 5:00 సుప్రభాతము, అభిషేకము, అలంకారము, ఆవాహిత దేవతా పూజలు
ఉ.8:30 ప్రధాన దేవత మంత్ర హవనములు, యజుర్వేద పారాయణము
11:30 సిద్ది బుద్ది సమేత గణపతి కళ్యాణము
సా.4:30 పంచసూక్త హవనములు, విష్ణు సహస్రనామ పారాయణము
సా.4:30 ప్రదోషపూజ, అవధారయలు, హారతి, మంత్ర పుష్పము, ప్రసాద వితరణ
రా.7:30 అష్టావధానము
బ్ర శ్రీ అష్టకాల విద్యాచరణ్ శర్మ గారిచే
18-06-2026, గురువారము
ఉ. 5:00 సుప్రభాతము, అభిషేకము, అలంకార దర్శనము
8:30 ఆవాహిత దేవతా పూజలు, శాంతి హవనము, శేష హవనములు, జయాదులు, బలిహరణము, మహా పూర్ణాహుతి, మహదాశీర్వచనము, అన్నప్రసాద వితరణ
సా.4:30 లలిత సహస్ర నామ స్తోత్రము, కనకధారా స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణములు
సా॥ 06:30 హరికథ : బ్ర॥శ్రీ॥ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే
19-06-2026, శుక్రవారము
ఉ. 5:00 సుప్రభాతము ఉ॥ 07:00 అష్టోత్తర శత కలశ స్థాపన పూజ (108 కలశాలు)
8:00 శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారిచే మూల విరాట్ మూర్తికి ఫల పంచామృత మహాభిషేకము
బ్ర॥ శ్రీ॥ అష్టకాల విద్యామనోహర్ శర్మ గారిచే గోపుర శిఖరములకు అభిషేకము తదుపరి సమస్త భక్తులచే అభిషేకము సూచన: ధోవతి కట్టుకొని గోచీ పెట్టుకున్న వారికే అభిషేకము చేయు అవకాశం కలదు. (రెడీమేడ్ కుట్టిన ధోతులు కట్టుకొనరాదు
సా.4:00 రధోత్సవము పట్టణ పురవీధులలో
20-06-2026, శనివారము
ఉ.5:00 మహాభిషేకము, అలంకార దర్శనము , 10:00 గురుస్వామి టి.పి. హరిదాసు గారిచే ప్రప్రథముగా మహాపడి పూజ, అయ్యప్ప భక్త సేవా సమాజము వారిచే భజన జరుగును. సాయంత్రము దీపోత్సవము.




