Medak: ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ కాలుష్యంపై కలెక్టర్‌కు వినతి
Medak: మెదక్ జిల్లా రంగయిపల్లిలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ కాలుష్యంపై కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నేత ఒంటరి ప్రతాపరెడ్డి.
Medak: ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ కాలుష్యంపై కలెక్టర్‌కు వినతి
మెదక్: మనోహరాబాద్ మండలం రంగయిపల్లి గ్రామంలో ఉన్న MS అగర్వాల్ పరిశ్రమ కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని భారత రాష్ట్ర సమితి నాయకుడు గజ్వేల్ అసెంబ్లీ ఇన్చార్జ్ ఒంటరి ప్రతాపరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ పరిశ్రమ కాలుష్యం మూలంగా పరిశ్రమకు మూడు నాలుగు కిలోమీటర్ల వరకు పంటలు పండడం లేదని కాలుష్య నీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రెండు గ్రామాల ప్రజలు వంట చేసుకోవడం సైతం ఇబ్బందికి గురవుతున్నారని ఆయన తెలిపారు ఈ పరిశ్రమ 2006 నుండి పరిశ్రమలో ఉత్పత్తులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 3 సార్లు పరిశ్రమను విస్తృత పరిచరని తెలిపారు.
పరిశ్రమ నుండి వెలవడుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయని వాటి వలన గ్రామంలోని ప్రజలకు చర్మ వ్యాదులు, శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని ఆయన అన్నారు. పరిశ్రమ వెదజల్లే దుమ్ము, దూళి వలన నల్లటి దుమ్ముతో ప్రజలు తీవ్ర అనారోగ్యనికి గురవుతున్నారని తెలిపారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వలన రద్దీ తీవ్రంగా ఉంటుందని, ప్రజలు రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్న పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు.
పరిశ్రమను వెంటనే మూసివేయాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ప్రజల అభిప్రాయం సేకరణకు వచ్చిన జిల్లా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల నుండి సేకరించలేదని వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి పారిశ్రమను వెంటనే మూసివేయాలని. ఆయన డిమాండ్ చేశారు పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యం వలన రైతుల పొలాల్లో పంటలు పండడం లేదని, పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు.
పరిశ్రమ నుండి బయటకు వస్తున్న కాలుష్య జలాలు పంట పొలాల్లోకి రావడం వలన వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు, కూలీల చేతులు, కాళ్ళపై దురదతో పాటు అనేక చర్మ వ్యాదులు వస్తున్నాయని అన్నారు. పరిశ్రమ నుండే వచ్చే నీళ్లు చెరువులు, కుంటాలలోకి వెళ్లడం వలన చేపలు చనిపోయి, మత్స్య కారులు నష్టపోతోతున్నారని అన్నారు. రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న పరిశ్రమపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
పర్యావరణ కాలుష్యం వలన భవిష్యత్లో గ్రామంలో పుట్టబోయే పిల్లలు అంగవైక్యంతో పుట్టే ప్రమాదం ఉందని అన్నారు. పరిశ్రమలో ఇప్పటికే అనేక సార్లు ప్రమాదలు జరిగి అనేక మంది చనిపోయరని అన్నారు. పరిశ్రమలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయంతో రెండు గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మాంటున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పరిశ్రమను ఎక్స్టెండ్ చేసుకునే హక్కు పరిశ్రమ యాజమాన్యంకు ఎక్కడిదని ప్రశ్నించారు.
ప్రజా అభిప్రాయ సేకరకనాలో గ్రామ ప్రజలు వ్యతిరేకించరని, ప్రజల అభిప్రాయంకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని అన్నారు. పరిశ్రమతో గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కాలుష్యం వెదజల్లి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న MS అగర్వాల్ పరిశ్రమపై చర్యలు తీసుకునే వరకు గ్రామ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాదు భారత రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు




