Medak: మెదక్ జిల్లా 'దిశా' కమిటీ సభ్యులుగా నలుగురిని నియమించిన కేంద్రం!

Medak: మెదక్ జిల్లా దిశా కమిటీ సభ్యులుగా పాపగారి రమేష్ గౌడ్, డి.స్వప్న, ఎం.లక్ష్మీ నరసింహారెడ్డి, బోడ పద్మల నియామకం. కేంద్ర ఉత్తర్వులు జారీ.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 17 Oct 2026 7:22 PM IST
Medak
X

Medak: మెదక్ జిల్లా 'దిశా' కమిటీ సభ్యులుగా నలుగురిని నియమించిన కేంద్రం!

మెదక్: మెదక్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా కమిటీ)లో నలుగురు సభ్యుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని దిశా విభాగం 2026 అక్టోబర్ 1వ తేదీన జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం మెదక్ జిల్లాకు చెందిన పాపగారి రమేష్ గౌడ్, డి. స్వప్న, ఎం. లక్ష్మీ నరసింహారెడ్డి, బోడ పద్మలను దిశా కమిటీ నాన్‌ అఫీషియల్ సభ్యులుగా నామినేట్ చేశారు.

ఈ నియామకాల్లో నర్సాపూర్ పట్టణానికి చెందిన పాపగారి రమేష్ గౌడ్‌కు జనరల్ కేటగిరీలో, డి. స్వప్నకు మహిళా కేటగిరీలో, హవేలీ ఘనపూర్ గ్రామానికి చెందిన ఎం. లక్ష్మీ నరసింహారెడ్డికి జనరల్ కేటగిరీలో, నర్సాపూర్‌కు చెందిన బోడ పద్మకు ఎస్సీ/ఎస్టీ కేటగిరీలో అవకాశం కల్పించారు.

ఈ సందర్భంగా దిశా కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకు, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు.

జిల్లా అభివృద్ధిలో దిశా కమిటీ కీలకం

కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాల అమలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను సమీక్షించడంలో దిశా కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. జిల్లాలో అభివృద్ధి పనుల అమలును పర్యవేక్షిస్తూ, ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కమిటీ వేదికగా నిలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సంబంధిత జిల్లా అధికారులు నియామకితుల పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం 15 రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. అనంతరం దిశా కమిటీ సమావేశాలకు సభ్యులను ఆహ్వానించనున్నారు.

మెదక్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, ఎంపీ రఘునందన్ రావుకు, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా నియమితులైన సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR