Medak: మెదక్ సమస్యలపై కలెక్టరేట్‌లో సిటిజన్ ఫోరం ధర్నా తరహా విజ్ఞప్తి!

Medak: మెదక్ సిటిజన్ ఫోరం ప్రతినిధులు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

NAGARAJ, MEDAK
Published on: 15 Jun 2026 4:06 PM IST
Medak
X

Medak: మెదక్ సమస్యలపై కలెక్టరేట్‌లో సిటిజన్ ఫోరం ధర్నా తరహా విజ్ఞప్తి!

మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు బి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొండల్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ స్టేడియంలో అథ్లెటిక్ అకాడమీ ని కొనసాగించుటకు తగిన చర్యలు తీసుకోవాలి.

జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, బాలుర బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలకు స్థలాలను కేటాయించి నూతన భవనాలను నిర్మించాలి. మెదక్ నుండి మక్త భూపతిపూర్ వెళ్లే రోడ్డు గత వర్షాకాలంలో దెబ్బతినందున పటిష్టం చేయాలని కొంటూరు నుండి వెంకటాపూర్ కి వెళ్లే రహదారిలో కోన్ టూర్ చెరువు యొక్క అలుగు పారడం వలన వెంకటాపురం శివాయపల్లికి గుట్ట కింది పల్లెకు వెళ్లేవారికి వర్షాకాలంలో ఇబ్బందులు ఏర్పడుతున్నందున బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని .

మెదక్ ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఐటిఐ కళాశాలకు స్థలాన్ని కేటాయింపు చేస్తూ నూతన భవనాన్ని నిర్మించాలి. మెదక్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలుర మరియు బాలికలకు హాస్టల్ వసతులను ఏర్పాటు చేయాలి. ఆయన డిమాండ్ చేశారు వెంటనే కలెక్టరు కొన్ని అంశాల పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ సిటిజన్ ఫోరం బాధ్యులు భూపాల్ రెడ్డి ,నాగభూషణం, ఆనందం, నరసింహులు గౌడ్, రాజశేఖర్ ,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story