Medak: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రోటోకాల్ పాటించాలి.. కలెక్టర్

Medak: జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.

NAGARAJ, MEDAK
Published on: 29 May 2026 7:24 PM IST
Medak
X

Medak: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రోటోకాల్ పాటించాలి.. కలెక్టర్

Medak: మెదక్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ వేడుకలు ప్రత్యేకంగా జరగాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. అన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు సంయుక్తంగా పనిచేయాల్సిందిగా సూచించారు.తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణలో భాగంగా.. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప్ర‌ముఖుల‌కు, పుర‌ ప్ర‌ముఖుల‌కు, అతిథులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేయాలని, ప్రోటోకాల్ (నిర్వహణ నియమాలు)ను అనుసరిస్తూ ప్రముఖులు, మీడియా, తదితర సీటింగ్ గ్యాలరీలను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏ ఓ యూనస్, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story