Medak: మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ!

Medak: మెదక్ జిల్లా శివాయపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్. జిల్లాలో ఇప్పటివరకు 750 ఇళ్లు పూర్తి.

NAGARAJ, MEDAK
Published on: 24 April 2026 3:23 PM IST
Medak
X

Medak: మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ!

Medak: నిరుపేదల సొంత ఇంటి కళను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో లబ్ధిదారుల ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్. పాల్గొన్నారు ఇందిరమ్మ గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో భాగంగా శివాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు తోట లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పక్కాగా పారదర్శకంగా జరుగుతుందన్నారు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

ఇందిరమ్మల నిర్మాణం కోసం ప్రభుత్వం

విడుదలవారీగా నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్కో గృహ నిర్మాణానికి ఐదు లక్షలు అందించడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని,

సూచించారు.జిల్లాలో ఇప్పటి వరకు 750 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యాయని, మిగిలిన వారు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 650 ఇండ్లు గృహప్రవేశాలు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, సర్పంచ్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story