Medak: హవేలీ ఘన్‌పూర్ కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
Medak: మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హవేలీ ఘన్‌పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Medak: హవేలీ ఘన్‌పూర్ కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
Medak: జిల్లా లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులను, వ్యవసాయ, సివిల్ సప్ప్లై అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంన సోమవారం కలెక్టర్ ఆకస్మికం గా సందర్శించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని ఇప్పటి వరకు 880. మంది రైతుల నుండి 4270. 040 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని 38 మంది రైతులకు -42 లక్షల రూపాయలు ఎకౌంట్లో.
జమ చేసే మన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా సాగేందుకు మూడు దశల్లో టోకెన్ పద్దతి ని పెట్టడం జరిగిందని.. దీనిని ఆయా శాఖల అధికారులు తూ. చ తప్పకుండ పాటించాలని తద్వారా.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేమ శాతం వచ్చిన ధాన్యం వేగం గా కొనుగోలు అవ్వడం జరుగుతుందన్నారు
కొనుగోలు ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యం బస్తాలను తరలించాలన్నారు.రవాణా పరంగా కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా తగు లారీలను నిర్వాహకులు కేంద్రాలకు సరైన సమయం లో వచ్చేలా పర్యవేక్షణ చేయాలనీ కలెక్టర్ సూచించారు
వేసవి ఎండల నేపథ్యంలో.. రైతులు తగు జాగ్రత్త లు తీసుకోవాలని. ఇచ్చిన టోకెన్ ల ఆధారంగా కేంద్రాలకు రావాలన్నారు.అలాగే కేంద్రాలలో తాగు నీరు, నీడ తదితర మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, తాసిల్దార్ సింధు రేణుక ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




