Medak: డిజిటల్ జనగణనలో మెదక్ కలెక్టర్ దంపతులు.. మీ వివరాలు నమోదు చేసుకున్నారా?

Medak: మెదక్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డిజిటల్ జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు.

NAGARAJ, MEDAK
Updated on: 17 May 2026 9:35 PM IST
Medak
X

Medak: డిజిటల్ జనగణనలో మెదక్ కలెక్టర్ దంపతులు.. మీ వివరాలు నమోదు చేసుకున్నారా?

మెదక్ : జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ జనగణన కార్యక్రమంలో తమ వివరాలను నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ జనగణన కార్యక్రమంలో భాగంగా, ప్రతి పౌరుడు ప్రొవిజనల్ గైడ్‌లైన్స్ ప్రకారం తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు జనాభా గణన, గృహ బాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని ప్రజలు తమ సమయాన్ని ఆదా చేసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story