Medak: మెదక్‌లో దిగ్విజయంగా ప్రజా పాలన.. కలెక్టర్ ప్రతిమా సింగ్
Medak: మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
Medak: మెదక్‌లో దిగ్విజయంగా ప్రజా పాలన.. కలెక్టర్ ప్రతిమా సింగ్
Medak: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, అదనపు ఎస్పీ విక్రాంత్,
కుమార్ సింగ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు,, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ లావణ్య,మున్సిపల్ వైస్ చైర్మన్లు మెదక్ దొంతి నరేష్ గౌడ్, , రామాయంపేట నబితా జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా వివిధ శాఖల ద్వారా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి నుండి గ్రామీణ ప్రాంతం వరకు ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్లు తెలిపారు.
వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కల్పించామని అన్నారు. చేపట్టిన కార్యక్రమాలను అన్ని శాఖలలో అమలు చేశామన్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో గ్రామసభలు నిర్వహించి శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేసి అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా హెల్త్ కార్యక్రమాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ రమణా శాఖ ద్వారా అరైవ్.. అలైవ్ కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
గ్రామస్థాయిలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. క్రైమ్ కంటే రహదారి ప్రమాదంలో చాలామంది మరణిస్తున్నారని ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో జరగనున్న రైతు వారం, సంక్షేమ వారోత్సవాలు, చైల్డ్ సేఫ్టీ, నో డ్రగ్స్, వ్యవసాయం, యువజన సర్వీసులు, విద్య, మహిళలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఉన్నాయని విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. క్షేత్రస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, అభివృద్ధి కోసం ఇన్నోవేషన్ ఐడియాలు అమలు చేయాలని తెలిపారు. అంతకుముందు వ్యవసాయ, ఉద్యానవన, ఇందిరమ్మ ఇండ్లు, వైద్య, మెప్మా, విద్యుత్ ఇందిరా మహిళా శక్తి, కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్, న్యూ రేషన్ కార్డ్స్, పోలీస్ ప్రమాదాల నివారణపై, వివిధ శాఖల జిల్లా అధికారులు సమగ్ర కార్యచరణ ను వివరించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, తాసిల్దార్లు, ఎంపీడీవోలు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




