Medak: నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్.. కలెక్టర్ హెచ్చరిక
Medak: మెదక్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.
Medak: నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్.. కలెక్టర్ హెచ్చరిక
Medak: మెదక్ మే 02 జిల్లాలో నకిలీ ఎరువులు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని .పిడి (PD) యాక్ట్ కింద కేసులు నమోదు కఠిన తరం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ, రెవిన్యూ, పోలీస్. సీడ్ కార్పొరేషన్ల సమన్వయంతో వానాకాలం 2026 లో పర్యవేక్షణ మరియు అమలు కోసం విత్తనాలు మరియు ఎరువుల కన్వర్జెన్స్ సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్,ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ రామకృష్ణ, డీఎస్పీలు మెదక్ ప్రసన్న కుమార్, తూప్రాన్ నరేందర్ గౌడ్
ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ రుద్ర మూర్తి, సంబంధిత వ్యవసాయ, రెవిన్యూ, పోలీస్ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల రహిత జిల్లాగా మెదక్ ను తీర్చిదిద్దాలని మెదక్ జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడటం , వచ్చే వానాకాలం పంటలకు ఎరువులు పురుగుమందులు రైతులకు బఫర్ స్టాక్
అందుబాటులో ఉండాలని అన్నారు.విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టడం కోసం జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించామని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని, “నకిలీ విత్తనాల రహిత జిల్లా” సాధన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 334 రిటైల్ విత్తన దుకాణాలు, 41 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, 334 లైసెన్సు కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారని.
ముఖ్యంగా పత్తి, వరి పంటలలో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉన్నందున, సీజన్ మొత్తం కఠిన తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు నకిలీ విత్తనాలు అనగా లైసెన్సు లేని సంస్థలు తయారు చేసినవని అనధికారికంగా విక్రయించబడినవి అని సరైన లేబులింగ్ లేని ప్యాకెట్లు, గడువు ముగిసినవి, ఉంటాయని టాస్క్ఫోర్స్ తనిఖీలలో సుదీర్ఘ పరిశీలన చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.2026 వానాకాలంలో సుమారు 03 లక్షల 26ఎకరాల్లో సాగు అంచనా వేయగా,
దానికి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా మార్క్ఫెడ్ ద్వారా తగిన నిల్వలను ముందే సిద్ధం చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా రైతులు విత్తనాలు కొనేముందు
తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, లూజ్ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దని రైతులకు సూచించారు. టాస్క్ ఫోర్స్ బృందాలు వారి విధులను సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా ముందుకు పోలన్నారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ, రెవిన్యూ పోలీస్ యంత్రాంగం టాస్క్ఫోర్స్ బృందాలుగా ఏర్పడి నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ముందుగా జిల్లా వ్యవసాయ విభాగం టెక్నికల్ సీడ్స్ అధికారిని వందన జిల్లాలో విత్తన చట్టాలు, వాటి అమలు, టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు, ఈ అంశాలపై ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు సుదీర్ఘంగా వివరించగా, ఫర్టిలైజర్ వ్యవసాయ అధికారిని. హర్ష ఎరువులు పురుగు మందులపై బఫర్ స్టాక్, అనుమతి లేని కలుపు మందు విక్రయాలు జరగకూడదని నాణ్యమైన ఎరువులు పురుగు మందులు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.




