Medak: మెదక్ కలెక్టరేట్‌లో మేడే సంబరాలు

Medak: మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మేడే వేడుకలు 2026 ఘనంగా నిర్వహించారు. కార్మికుల సంక్షేమమే అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.

NAGARAJ, MEDAK
Published on: 1 May 2026 6:11 PM IST
Medak
X

Medak: మెదక్ కలెక్టరేట్‌లో మేడే సంబరాలు

మెదక్: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో* భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు - 2026 ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్,కార్మిక శాఖ సహాయ కమిషనర్ సాహితి, జడ్పి సీఈఓ ఎల్లయ్య తో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.కార్మికులకు సరైన సబ్సిడీలు, బీమా సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు.అలాగే ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల సంక్షేమం, కర్మాగారాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంఘాల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పోస్టర్స్ ను ఆవిష్కరించారు. కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సంబంధిత పరిశ్రమల శాఖ యాజమాన్యం ఐ.టీ.సీ ఫ్యాక్టరీస్.సిబ్బంది కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story