Medak: జిల్లాలో ధాన్యపు గింజ వదలకుండా కొనుగోలు చేస్తాం.. కలెక్టర్

Medak: మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో గూగుల్ మీట్ సమీక్ష. ఇప్పటివరకు 71వేల మంది రైతుల నుండి ధాన్యం సేకరణ.

NAGARAJ, MEDAK
Published on: 4 Jun 2026 6:48 PM IST
Medak
X

Medak: జిల్లాలో ధాన్యపు గింజ వదలకుండా కొనుగోలు చేస్తాం.. కలెక్టర్

మెదక్: రైతులు అధైర్య పడోద్దని ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి అధికారులతో గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దు అన్నారు.

ఈ రోజు వరకు 71,327 మంది రైతుల నుంచి 3,50,620.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 57,496 మంది రైతుల లకు రూపాయలు 616.93 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయన్నారు. 200 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసి కేంద్రాలను ముసివేయడం జరిగిందనీ,

ధాన్యం కొనుగోలు పూర్తి అయిన కేంద్రాల్లోని హమాలి , లారీలను ధాన్యం పూర్తి కానీ కేంద్రాలకు తరలించి వేగంగా అన్లోడింగ్ జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దేవకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానంద తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story